సమాజ సేవకుడు భాగ్యరెడ్డి వర్మ సేవలు చిరస్మరణీయం.
Views: 4
On
హుజురాబాద్,మే 22(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శ్రీ ఎం.వి భాగ్యరెడ్డి వర్మ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని పాల్గొని భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలతో జయంతి వేడుక చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో కమిషనర్ కిషన్ , మేనేజర్ భూపాల్ రెడ్డి , రమేష్ , కిరణ్ , వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, ఆఫీస్ సిబ్బంది, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments