కెమిస్టుల హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త బంద్‌కు భీమదేవరపల్లి మండలంలో మద్దతు

ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంఘం పిలుపుకు సంఘీభావం

కెమిస్టుల హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త బంద్‌కు భీమదేవరపల్లి మండలంలో మద్దతు

భీమదేవరపల్లి, మే 20 (తెలంగాణ ముచ్చట్లు):

ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన 24 గంటల దేశవ్యాప్త బంద్ పిలుపుకు మద్దతుగా భీమదేవరపల్లి మండలంలోని మెడికల్ షాపులు బుధవారం స్వచ్ఛందంగా బంద్ నిర్వహించనున్నట్లు మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ, చిన్న కెమిస్టులు ప్రస్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆన్‌లైన్ ఫార్మసీల విస్తరణ, తరచూ మారుతున్న నిబంధనలు, పెరుగుతున్న వ్యాపార పోటీ కారణంగా చిన్న వ్యాపారులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

చిన్న కెమిస్టుల హక్కులను పరిరక్షించేందుకు, వారి సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ బంద్‌కు సహకరించాలని, అత్యవసర మందులు అవసరమైన వారు ముందస్తుగా కొనుగోలు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బొజ్జపూరి మురళి, మామిడాల రవీందర్, ఉడుత శ్రీనాథ్, సుద్దాల వనరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .