సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కొండంత అండ.
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు .
వనపర్తి,మే17(తెలంగాణ ముచ్చట్లు):
పేదల ఆరోగ్య రక్షణలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో 111 మంది లబ్ధిదారులకు రూ.28 లక్షల 22 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందలేని పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద కుటుంబాలకు ఎంతో ఊరట లభిస్తోందని, ఇది వారి ఆరోగ్యానికి కొండంత ఆసరాగా నిలుస్తోందన్నారు.చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, కాంగ్రెస్ నాయకులు రాజేంద్రప్రసాద్ యాదవ్, దేవన్న యాదవ్, చంద్రశేఖర్, బాబా, ఆవుల చంద్రశేఖర్, గంగాధర్, అనిల్ నాయుడు, ఎత్తం చరణ్ రాజ్, గట్టు మన్యం తదితరులు పాల్గొన్నారు.


Comments