కిష్టారం ఓసీలో మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం.!

సింగరేణి అభివృద్ధికి సమిష్టి కృషి చేయాలి.

కిష్టారం ఓసీలో మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం.!

సత్తుపల్లి, మే 20 (తెలంగాణ ముచ్చట్లు): 

సింగరేణి సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేస్తూ నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచాలని సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాసరావు అన్నారు.IMG-20260520-WA0052సత్తుపల్లి ఏరియాకు చెందిన కిష్టారం ఓసీలో బుధవారం నిర్వహించిన మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి, రెండో షిఫ్ట్‌లలో జరిగిన ఈ సమావేశాల్లో ఉద్యోగులకు సంస్థ లక్ష్యాలు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఆదేశాల మేరకు అన్ని ఏరియాల్లో మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులంతా రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ సమైక్య భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కిష్టారం ఓసీ నిర్దేశిత లక్ష్యాలను సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. “మన సంస్థ–మన గని–మన బాధ్యత” అనే భావనతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిజిఎం(ఐఈ) ఎన్. యోహాన్ మాట్లాడుతూ సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత, యంత్రాల పనితీరు, ఉత్పత్తి వ్యయం తగ్గింపు, ఉద్యోగుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏఎల్ఎస్‌వీ సునీల్ వర్మ, ఎస్ఓ టు జీఎం బి. శ్రీనివాసు, ఎజిఎం(ఎఫ్&ఏ) ఈ. బీబత్స, ప్రాజెక్ట్ ఇంజనీర్ జి. వెంకటేశ్వరరావు, డిప్యూటీ పీఎం జి. హరీష్, ఎస్‌వోఎం బి. రామకృష్ణ, అడిషనల్ మేనేజర్ వల్లమల్ల బాబు, రక్షణాధికారి గోపి కిషోర్, వెల్ఫేర్ ఆఫీసర్ (ఇన్‌చార్జి) కె. శ్రీనివాస్, ఐఎన్‌టీయూసీ పిట్ సెక్రటరీ బాలాజీ, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ కిషోర్ కుమార్‌తో పాటు అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .