రెండు వారాలు గడిచినా ధాన్యం డబ్బులు లేవు… ఐకేపీ సెంటర్ నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం.
Views: 6
On
వేలేరు, మే 16 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలోని ఐకేపీ సెంటర్‌లో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాలు గడిచినా తమ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని వారు చెబుతున్నారు.
ఈ విషయమై ఐకేపీ సెంటర్ నిర్వాహకులను ప్రశ్నించినప్పటికీ సరైన స్పందన లభించలేదని, పొంతనలేని సమాధానాలు ఇస్తూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
తక్షణమే బకాయి చెల్లింపులు చేయాలని, సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments