దళిత బంధు ఆలస్యంపై మండిపడ్డ బాధితులు.. చైర్మన్‌కు వినతి.

దళిత బంధు ఆలస్యంపై మండిపడ్డ బాధితులు.. చైర్మన్‌కు వినతి.

జమ్మికుంట టౌన్ మే 15 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్త మున్సిపల్ కార్యాలయం ముందు దళిత బంధు బాధితులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దళిత బంధు 2వ విడత నిధులను వెంటనే విడుదల చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా స్పందించిన మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకంలో కొందరికి రూ.5 లక్షలు, మరికొందరికి పూర్తి స్థాయిలో నిధులు అందాయని తెలిపారు. ఇంకా కొంతమందికి 2వ విడత అందాల్సి ఉందని, సంబంధిత అధికారులతో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కరికీ నిధులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు చింతల శ్రీనివాస్, చంద రాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .