రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు సలీం.. నేతలు తీరుపై చర్చ.

రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు సలీం.. నేతలు తీరుపై చర్చ.

జమ్మికుంట టౌన్ మే 14 (తెలంగాణ ముచ్చట్లు):
 
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ సలీం (46) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆయన మృతితో ధర్మారం గ్రామంతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ నెల 4న హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామం నుండి తన స్వగ్రామమైన ధర్మారం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా రాజపల్లి-తోకలపల్లి గ్రామాల మధ్య హుజురాబాద్ హైవేపై వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సలీంను స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్‌లోని అమృత న్యూరో కేర్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో చివరకు ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు.
మహమ్మద్ సలీం కాంగ్రెస్ పార్టీలో దాదాపు 25 సంవత్సరాలుగా కొనసాగుతూ ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా సేవలందించారు. హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. రాజకీయ ప్రస్థానంలో ఇతర పార్టీల వైపు చూడకుండా కాంగ్రెస్ పార్టీలోనే నిబద్ధతతో కొనసాగిన నాయకుడిగా గుర్తింపు పొందారు.
అయితే ప్రమాదం జరిగిన నాటి నుండి చికిత్స పొందుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క అగ్ర నాయకుడు కూడా సలీంను పరామర్శించకపోవడం పట్ల స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సలీం ఆరోగ్య పరిస్థితిని అతని సన్నిహితులు, స్నేహితులు మాత్రమే తెలుసుకుంటూ అండగా నిలిచారని చెబుతున్నారు.
ఈ ఘటనపై జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, హుజురాబాద్, కమలాపూర్ మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అగ్ర నాయకుల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కార్యకర్తలకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే పార్టీ నాయకత్వం అండగా నిలుస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .