మోదీ సభ విజయానికి గంట సంపత్ కృషి
బోర్నపల్లి నుండి తరలిన బీజేపీ శ్రేణులు.
Views: 8
On
హుజురాబాద్, మే 10(తెలంగాణ ముచ్చట్లు ):
హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయడంలో బోర్నపల్లి బీజేపీ నాయకుడు గంట సంపత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
గంట సంపత్ ఆధ్వర్యంలో ఆదివారం బోర్నపల్లినుంచి ప్రత్యేక బస్సులో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు భారీగా హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మోదీకి మద్దతుగా నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ప్రయాణం ప్రారంభించారు.
ఈ సందర్భంగా గంట సంపత్ మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు నరేంద్ర మోదీ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వర్గ ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు. హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభ చారిత్రాత్మక విజయంగా నిలవాలని, తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments