జమ్మికుంటలో గుర్తుతెలియని వ్యక్తి మృతి.. వడదెబ్బ అనుమానం.

జమ్మికుంటలో గుర్తుతెలియని వ్యక్తి మృతి.. వడదెబ్బ అనుమానం.

 జమ్మికుంట టౌన్ మే 08 (తెలంగాణ ముచ్చట్లు):
 
జమ్మికుంట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ఏరియాలో గల వాటర్ ట్యాంక్ సమీపంలో గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఉదయం సుమారు 7 గంటల సమయంలో రోడ్డుపై ఓ వ్యక్తి మృతి చెందిన స్థితిలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిగా గుర్తించారు. స్థానికుల వివరాల ప్రకారం, అతను గత 15 రోజులుగా జమ్మికుంటలో లేబర్ పని చేస్తూ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు తెలిసింది.
బుధవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో సూపర్ డ్రెస్సెస్ షాప్ ముందు అతను పడుకొని ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల నమోదవుతున్న తీవ్ర ఎండలIMG-20260508-WA0089 నేపథ్యంలో వడదెబ్బ తగిలి అతను మృతి చెందినట్టుగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .