రోడ్లపై పంటలు ఆరబెట్టడమే ఇద్దరి మృతికి కారణమా..?

అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు..

రోడ్లపై పంటలు ఆరబెట్టడమే ఇద్దరి మృతికి కారణమా..?

జమ్మికుంట టౌన్ మే 08 (తెలంగాణ ముచ్చట్లు):
 
కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలోని వల్గాపూర్ – జగ్గయ్యపల్లె మధ్య గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరో యువకుడు ప్రాణాపాయ స్థితిలో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
స్థానికుల కథనం ప్రకారం, బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తుండగా రహదారిపై ఉన్న ఎడ్లబండిని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి వేళల్లో రహదారులపై వరి ధాన్యం, మక్కజొన్న పంటలు ఆరబెట్టడం, సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం వంటి కారణాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై తెలంగాణ రైతు సహాయ జిల్లా స్థాయి సహకార కార్యదర్శి చెల్పూరి రాములు తీవ్రంగా స్పందించారు. రహదారులను పంటల ఆరబెట్టే ప్రదేశాలుగా మార్చడం వల్ల అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని మండిపడ్డారు. రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ, మార్కెట్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
రోడ్లపై పంటలు ఆరబెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని, ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రహదారులపై పంటలు ఆరబెట్టకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని, IMG-20260508-WA0085మృతి చెందిన కుటుంబాలకు తగిన సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .