ఆశ కార్యకర్తల నిరసన.
Views: 5
On
హుజురాబాద్ మే 5(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్చి ) ముందు ఆశ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమకు రావాల్సిన మార్చి, ఏప్రిల్ నెలల పెండింగ్ పారితోషికాలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆశ కార్యకర్తలు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో తాము కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, సరైన వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సమయానికి పారితోషికాలు రాకపోవడం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా ఆశ కార్యకర్తలకు నెలకు కనీసం రూ.18,000 ఫిక్స్ వేతనం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఆశ కార్యకర్తలు పాల్గొని తమ ఐక్యతను చాటారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
నిరసన అనంతరం ఆశ కార్యకర్తలు తిరిగి తమ విధుల్లో చేరి సేవలను కొనసాగించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments