మహిళలకు స్వయం ఉపాధి దిశగా మినీ డైరీ యూనిట్లు.

ఎంపీడీవో ఎన్. విజయ్ కుమార్.

మహిళలకు స్వయం ఉపాధి దిశగా మినీ డైరీ యూనిట్లు.

ఎల్కతుర్తి, మే 5 (తెలంగాణ ముచ్చట్లు):
 
గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో బీసీ మరియు ఎస్సీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మినీ డైరీ యూనిట్ల ఏర్పాటు కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎల్కతుర్తి మండల ఎంపీడీవో ఎన్. విజయ్ కుమార్ తెలిపారు.
ఈ పథకం కింద రెండు బర్రెలతో మినీ డైరీ యూనిట్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించబడుతుందని పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్ పరిధిలో యూనిట్ ఏర్పాటు చేసుకోవాలనుకునే అభ్యర్థులు మే 10, 2026లోపు తమ దరఖాస్తులను సంబంధిత గ్రామ పంచాయతీలలో ఆఫ్‌లైన్ ద్వారా సమర్పించాలని సూచించారు. యూనిట్ మొత్తం ఖర్చు రూ.2 లక్షలు కాగా, అందులో 70 శాతం సబ్సిడీగా, మిగతా 30 శాతం బ్యాంకు రుణంగా అందించబడుతుందని వివరించారు. ఇదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా మినీ డైరీ యూనిట్లకు దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయని తెలిపారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 0.10 ఎకరాల స్వంత వ్యవసాయ భూమి కలిగి ఉండాలని, వయస్సు 21 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలని, వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల లోపు ఉండాలని, పాడి పరిశ్రమలో అనుభవం ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రం జత చేయాలని సూచించారు.
అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని ఎంపీడీవో కోరారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .