అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.

అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.

అక్రమ రవాణా జరిగితే 8712659111 కు సమాచారం ఇవ్వాలి
 
–పోలీస్ కమిషనర్ సునీల్ దత్ 
 
ఖమ్మం బ్యూరో, మే 4(తెలంగాణ ముచ్చట్లు )
 
ఆవులు, దూడల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, వ్యక్తిగత దాడులకు పాల్పడడం చట్టరీత్యా నేరమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.  
పశువుల రవాణాకు సంబంధించిన నిబంధనలు, చట్టపరమైన అంశాలపై 
గో రక్షణ కమిటీ తో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహంచారు. 
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... గో రక్షకుల పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోని దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు వుంటాయని అన్నారు.పశువుల అక్రమ రవాణాను గమనిస్తే, వెంటనే 8712659111 కు, స్థానిక పోలీసులకు, డయల్ 100 కు సమాచారం అందించి సహకరించాలన్నారు.
ఇప్పటికే జిల్లా సరిహద్దులో ఏడు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించి, పట్టుబడిన పశువులను దగ్గరలోని గోశాలలకు తరలించాలని ఆదేశించామన్నారు. ఆవులు, దూడల అక్రమ రవాణా, అమ్మకం లేదా వధకు వ్యతిరేకంగా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని అన్నారు. చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా జంతువుల కదలికలను పర్యవేక్షించడానికి అధికారులు మూడు షిఫ్టులలో చెక్‌పాయింట్‌లను ఏర్పాటు చేసారని అన్నారు. పశువుల రవాణాదారులు అందరూ పశువైద్యుల నుండి చెల్లుబాటు అయ్యే ధృవపత్రాలు, అధికారిక రవాణా రసీదులను కలిగి ఉండాలన్నారు. శాంతిని కాపాడటానికి జంతు సంక్షేమ నిబంధనలను పాటించడానికి పరిపాలనకు సహకరించాలని సంబంధిత వర్గాలందరికీ విజ్ఞప్తి చేశారు. ఏమైనా సమస్యలుంటే స్థానిక పోలీసులకు తెలియజేయాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తును పటిష్టం చేస్తామన్నారు.
కార్యక్రమంలో ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, మహేష్, సిఐ లు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .