ప్రజల సహకారంతోనే సెన్సెస్ విజయవంతం.
జిల్లా డిప్యూటీ గణాంక అధికారి.
Views: 9
On
జమ్మికుంట టౌన్ మే 04 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెన్సెస్ నమోదు కార్యక్రమం పూర్తి చేయడంలో ప్రజల సహకారం ఎంతో కీలకమని జిల్లా డిప్యూటీ గణాంక అధికారి కిషన్ రావు తెలిపారు.
సోమవారం ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ చివరి రోజు సందర్భంగా, మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో శిక్షణ జరుగుతున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సెన్సెస్‌లో పేర్కొన్న అన్ని వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే నిర్వహించాలని, అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు సర్వేను పూర్తిచేసి సమర్పించాలని తెలిపారు.
టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీధర్, టిపిఎస్ రాజ్‌కుమార్, టిపిబివో దీపికల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి సందేహాలు వచ్చిన వెంటనే నివృత్తి చేసుకొని, పూర్తి వివరాలు నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments