పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డికి ఘన వీడ్కోలు.

పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డికి ఘన వీడ్కోలు.

పెద్దమందడి,మే02( తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం శనివారం పెద్దమందడి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, రైతులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై జగదీశ్వర్ రెడ్డిని ఘనంగా సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జగదీశ్వర్ రెడ్డి తన ఉద్యోగ జీవితంలో నిజాయితీ, క్రమశిక్షణ, సేవా భావంతో పనిచేసి రైతులకు అందుబాటులో ఉంటూ సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. రైతు సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, సహనంతో వ్యవహరించిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
సింగిల్ విండో అభివృద్ధి, రైతులకు అవసరమైన సేవలు అందించడంలో జగదీశ్వర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, సహచర ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారని నాయకులు తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
తనకు సహకరించిన ప్రజాప్రతినిధులు, రైతులు, సహచర సిబ్బందికి జగదీశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో అందరి సహకారంతోనే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలిగానని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .