వైద్యరంగ సేవలకు గౌరవ వందనం…

మోహన్ రెడ్డి రిటైర్మెంట్ వేడుక.

వైద్యరంగ సేవలకు గౌరవ వందనం…

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
 
జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య విద్యా బోధకుడిగా సేవలందిస్తున్న అడిదెల మోహన్ రెడ్డి పదవీ విరమణ పొందనున్న సందర్భంగా ఆయనకు ఘనంగా సన్మాన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం జమ్మికుంట పట్టణంలోని బీఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో వైభవంగా జరిగింది.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ మోహన్ రెడ్డిని శాలువా, స్మారక చిహ్నంతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మోహన్ రెడ్డి గత 35 సంవత్సరాలుగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. క్రమశిక్షణ, నిబద్ధత, నీతి, నిజాయితీకి ఆయన మారుపేరుగా నిలిచారని, ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని పేర్కొన్నారు.
సేవా కాలం మొత్తం ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించారని, సహచరులకు మార్గనిర్దేశకుడిగా నిలిచారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రవణ్ కుమార్, పిఓ ఎంసిహెచ్ డాక్టర్ సనజవేరియా, వైద్యాధికారులు డాక్టర్ వరుణ, డాక్టర్ తులసీదాస్, డాక్టర్ చందన, డిప్యూటీ డెమో దుర్గారావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .