లైఫ్ లైన్ పౌండేషన్ సేవలు అభినందనీయం .

డాక్టర్ షేక్. ఫయాజ్ 

లైఫ్ లైన్ పౌండేషన్ సేవలు అభినందనీయం .

ఖమ్మం బ్యూరో , ఏప్రిల్ 19(తెలంగాణ ముచ్చట్లు )
 
 లైఫ్ లైన్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి నిస్వార్థ సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎండోకేర్ ఆస్పత్రి డాక్టర్ షేక్. ఫయాజ్ అన్నారు. ఆదివారం లైఫ్ లైన్ పౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక 38వ డివిజన్ లోని లైఫ్ లైన్ ఫౌండేషన్ కార్యాలయంలో సామాజిక సేవా కార్యకర్తలకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎండోకే ఆస్పత్రి  డాక్టర్ షేక్. ఫయాజ్ మాట్లాడుతూ 
సామాజిక సేవ కార్యకర్తలకు లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం తలపెట్టడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమానికి తనను ముఖ్యఅతిథిగా పిలవడం ఆనందంగా ఉందన్నారు.లైఫ్ లైన్ ఫౌండేషన్( ఖమ్మం ) ఆధ్వర్యంలో జిల్లాలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సామాజిక సేవ కార్యకర్తల
వలే పలువురు సేవా దృక్పథంతో సేవా కార్యక్రమాలు తలపెట్టాలని కోరారు. సామాజిక సేవా కార్యకర్తలకు శాలువాలు కప్పి, సన్మానించి, మెమొంటులు అందజేసిన కార్యక్రమంలో    లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షేక్. జానీ మియా తో పాటు షేక్ నజీరుద్దీన్, షేక్. హసన్, బాబు సాహెబ్, ఖాసిం, ఆశ, అమీర్, శ్రీరామ్ గిరి , , మన్సూర్ అలీ, ఖదీర్, ఇమామ్, సైదా, నాగుల్ మీరా, రహీం, శంషుద్దీన్, జుల్ఫికర్ అలీ, రషీద్ ,  ఇమ్రాన్ ,అఫ్జల్  అజ్మతుల్లా, హుస్సేన్ మియా, సొందు మియా, అహ్మద్  మహమ్మద్ జానీ, బషీర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .