వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయినా...ధాన్యం కొనుగోలు నత్తనడక .

రమేష్ బిజెపి మాజీ మండల అధ్యక్షుడు 

వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయినా...ధాన్యం కొనుగోలు నత్తనడక .

పెద్దమందడి,ఏప్రిల్28(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వివిధ గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెద్దమందడి బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలు, ఉరుములు మెరుపులతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినా, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రోజులు తరబడి అక్కడే నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వర్షాల కారణంగా ధాన్యం తడిసి నష్టపోయే ప్రమాదం ఉన్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు స్పందించడం లేదని విమర్శించారు.కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు వెంటనే న్యాయం చేయాలని, కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

బలిదుపల్లి మహిళా సంఘంలో అవినీతి ఆరోపణలు. బలిదుపల్లి మహిళా సంఘంలో అవినీతి ఆరోపణలు.
    అడ్డాకల్, ఏప్రిల్29(తెలంగాణ ముచ్చట్లు): మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని బలిదుపల్లి గ్రామ మహిళా సంఘంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ గ్రామానికి చెందిన 5వ వార్డు సభ్యుడు ఆంజనేయులు
హుజురాబాద్‌లో అమరవీరుల స్మారక బ్యారక్ ప్రారంభం .
హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్‌పై రాజకీయ తుపాన్ .
పదవ తరగతి ఫలితాల్లో నారాయణ స్కూల్ విజయకేతనం.
సీఆర్‌పీలకు బదిలీలు చేపట్టాలి.
చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది .
వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయినా...ధాన్యం కొనుగోలు నత్తనడక .