కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడిగా పెండ్లి వెంకటేష్ ఏకగ్రీవం.

కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడిగా పెండ్లి వెంకటేష్ ఏకగ్రీవం.

వేలేరు, ఏప్రిల్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గ్రామానికి చెందిన పెండ్లి వెంకటేష్‌ను గ్రామ యూత్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేష్ మాట్లాడుతూ, పార్టీ శ్రేయస్సు కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని, గ్రామంలోని యువతను కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సమీకరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల సమస్యలను పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తానన్నారు. అలాగే పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నూతన యూత్ అధ్యక్షుడి ఎన్నికతో గ్రామంలో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .