ఉపాధ్యాయుడు సురభి శ్రీనివాసులు సన్మానం .

మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా పెన్షన్ పత్రాల అందజేత.

ఉపాధ్యాయుడు సురభి శ్రీనివాసులు సన్మానం .

వనపర్తి,ఏప్రిల్19(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్.జి. గార్డెన్‌లో సురభి శ్రీనివాసులు (స్కూల్ అసిస్టెంట్, సాంఘిక శాస్త్రం, యుపిఎస్ మున్ననూరు, గోపాల్పేట మండలం) ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై, సురభి శ్రీనివాసులు ను సన్మానించారు. అలాగే హైదరాబాద్ ఏజీ ఆఫీస్ నుంచి మంజూరు అయిన పెన్షన్, కమ్యూటేషన్, గ్రాట్యుటీ ధ్రువపత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సురభి శ్రీనివాసులు 37 సంవత్సరాల సుదీర్ఘ సేవా కాలంలో అనేకమంది విద్యార్థులను తీర్చిదిద్దారని, ఎక్కడ పనిచేసినా అక్కడి ప్రజలతో మమేకమై వారి అవసరాల కోసం కృషి చేశారని పేర్కొన్నారు. ఉద్యోగానికి విరమణ చేసిన తర్వాత కూడా ప్రజల మధ్య సేవ కొనసాగించాలని సూచించారు.జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు సూగూరు వరప్రసాదరావు మాట్లాడుతూ, సురభి శ్రీనివాసులు ఉపాధ్యాయ సంఘాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఉద్యోగ విరమణకు ముందే పెన్షన్, కమ్యూటేషన్, గ్రాట్యుటీ ధ్రువపత్రాలు మంజూరు కావడం విశేషమన్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్టీయూ సంఘం ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ఎస్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరై సురభి శ్రీనివాసులు ను సన్మానించారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .