హిందూ సమ్మేళనం కోసం జమ్మికుంట రెడీ

ఏప్రిల్ 25న మహా హిందూ సమ్మేళనం!

హిందూ సమ్మేళనం కోసం జమ్మికుంట రెడీ

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
 
జమ్మికుంట పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోనుంది. ఈ నెల 25న పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం (బొమ్మల గుడి)లో మహా హిందూ సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గోపూజతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం భక్తుల్లో విశేష ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఈ ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పిలుపునిచ్చారు. సనాతన సంప్రదాయాల పరిరక్షణతో పాటు సమాజంలో ఐక్యతను పెంపొందించడమే ఈ సమ్మేళనం లక్ష్యమని తెలిపారు.
ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలో స్థానిక కౌన్సిలర్ చందా రాజు, బచ్చు భాస్కర్, యాంసాని సురేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమ్మేళనం జమ్మికుంటలో ఆధ్యాత్మిక ఉత్సవంగా నిలవనుందని స్థానికులు భావిస్తున్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .