జమ్మికుంటలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.
సామాన్యుడి ఇల్లు కల చిద్రమవుతోంది!
Views: 13
On
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక మండలాల్లో ఇసుక అక్రమ రవాణా అదుపు తప్పింది. ఇసుక దొరకడం కష్టంగా మారడంతో సామాన్య ప్రజలు ఇల్లు నిర్మించుకోవడం భారంగా మారింది. ఒకవైపు కొరత, మరోవైపు ట్రాక్టర్ యజమానుల దోపిడీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం టోకెన్లు ఇస్తున్నామని చెప్పి మోసాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒక ట్రాక్టర్‌కు టోకెన్ ఇచ్చి, మరొక ట్రాక్టర్ ఇసుకను సరఫరా చేస్తున్నారని, మధ్యలో దోపిడీ జరుగుతోందని అంటున్నారు.
ఇసుక ధరలు 4 వేల నుంచి 6 వేల రూపాయల వరకు పెరగడంతో సామాన్యులకు ఇల్లు కట్టడం కష్టసాధ్యమైంది. ఇసుక లేకుండా నిర్మాణం సాధ్యం కాకపోవడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు.
పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని చెబుతున్నా, అవి భారీ లారీలకే పరిమితమయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్ల ద్వారా మాత్రం వంకర మార్గాల్లో అక్రమ రవాణా కొనసాగుతోందని స్థానికులు అంటున్నారు. తెల్లవారుజామునే ట్రాక్టర్ల రాకపోకలు పెరగడంతో వాకింగ్‌కు వెళ్లే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ట్రాక్టర్ డ్రైవర్లు వేగంగా, నిర్లక్ష్యంగా నడిపించడంతో ప్రమాద భయం వెంటాడుతోందని మహిళలు వాపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుకను సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments