ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ

ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ

- శంకుస్థాపన చేసిన తుంబూరు దయాకర్ రెడ్డి*

- కైకొండాయిగూడెంలో ఆధ్యాత్మిక కోలాహలం*

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు)

ఖమ్మం నగరం ఒకటో డివిజన్ కైకొండాయిగూడెంలో వెలిసిన ముత్యాలమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పనులకు సోమవారం ఘనంగా శ్రీకారం చుట్టారు.  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.

*శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు..*
ప్రముఖ వేద పండితుడు బాదంపూడి రామలింగేశ్వర శర్మ పర్యవేక్షణలో గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులను వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తి కావాలని, ఈ ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పురోహితులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాగటి శ్రీను, నాగటి ఉపేందర్, తుళ్లూరి మాధవరావు - కోటేశ్వరి దంపతులు, మద్దినేని ప్రసాద్, ఆళ్ల రమేష్, గద్దల నాగేశ్వరరావు, గద్దల చిన్నప్ప, తుళ్లూరి కృష్ణయ్య, కొల్పు వెంకటేశ్వర్లు, పందుల తిరుపతిరావు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .