సత్తుపల్లి డిపోలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

మహానేత సేవలను స్మరించిన ఆర్టీసీ అధికారులు.

సత్తుపల్లి డిపోలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

సత్తుపల్లి, ఏప్రిల్ 5 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) సత్తుపల్లి డిపోలో డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి ఆయన చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ఆదర్శప్రాయమని తెలిపారు. భారతదేశ తొలి ఉప ప్రధానిగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్. సాహితి, వెల్ఫేర్ కమిటీ సభ్యులు సైదిరెడ్డి, ఎస్సీ–ఎస్టీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు జగన్నాథం, వెంకటయ్య, బసవయ్య, బాలస్వామి, టి.ఐ. త్రీ జాకబ్, ఏడీసీలు కిరణ్ బాబు, కాంతారావు, సత్యం తదితరులు పాల్గొన్నారు. గ్యారేజీ సిబ్బంది మరియు ఇతర ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .