సిర్సపల్లి పల్లె దవాఖానాపై ఆకస్మిక తనిఖీ… సేవల్లో మెరుగుదలకు సూచనలు

సిర్సపల్లి పల్లె దవాఖానాపై ఆకస్మిక తనిఖీ… సేవల్లో మెరుగుదలకు సూచనలు

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):

హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలోని పల్లె దవాఖానాను డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రవణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానా పనితీరు, సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు.
సిబ్బంది సమయపాలనకు కట్టుబడి పనిచేయాలని ఆయన ఆదేశించారు. రోగులకు అవసరమైన బీపీ, షుగర్ మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని, రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.
ప్రస్తుత వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డిహైడ్రేషన్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గ్రామస్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకునేలా చైతన్యం చేయాలని అధికారులను ఆదేశించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .