మేడ్చల్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

మేడ్చల్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

_అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ చేత నివాళులు

_నేడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

మేడ్చల్, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ అనుమతితో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.అంతాయపల్లి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హాల్‌లో గురువారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) ఫైజాన్ అహ్మద్, ఐఏఎస్ జ్యోతి ప్రజ్వలన చేసి, పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పాపన్న గౌడ్ సమాజ ఉన్నతి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (ఎఫ్ ఏ సి) ఆర్.ఎస్. చంద్రావతి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి టి. ఝాన్సీ రాణి పాల్గొని, పాపన్న గౌడ్ జీవిత విశేషాలను స్మరించారు. అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 3న ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ
చిల్పూర్,ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు): భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిల్పూర్ మండలంలో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని...
సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి... 
జిల్లాలో విజయవంతంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ ... 
జమ్మికుంట గణేష్ నగర్‌లో దివ్య హనుమాన్ పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
పట్టు చీర మహోత్సవానికి హాజరైన చిన్నారెడ్డి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు జమ్మికుంటలో మంచి స్పందన
పెద్ద తండలో సన్న బియ్యం పంపిణీ…