కిడ్నాప్ కేసులో పదిమంది నిందుతులను అరెస్ట్ చేసిన ముదిగొండ పోలీసులు

కిడ్నాప్ కేసులో పదిమంది నిందుతులను అరెస్ట్ చేసిన ముదిగొండ పోలీసులు

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 2(తెలంగాణ ముచ్చట్లు)

2026 మార్చి 25 న తెల్లవారుజామున పండ్రెగుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ / ప్రస్తుత సర్పంచ్ భర్త అయిన పాము సిల్వరాజు ఉదయం తన ఇంటి నుండి బయలుదేరి వాకింగ్ చేసుకుంటూ ఖానాపురం వైపు వెళుతుండగా... ఊరి శివారులో గల బాబా సాహెబ్ మొక్కజొన్న చేను దగ్గరలోకి వెళ్ళే సరికి అశోక్ లేలాండ్ వాహనంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినారని, గత కొంతకాలంగా సిల్వరాజుపై అదే గ్రామానికి చెందిన షేక్ ఫక్రుద్దీన్ అతని కొడుకులు షేక్ బోధలు సాహెబ్, షేక్ ఖాసిం సాహెబ్ అనువారు వారి పాలివాండ్ల భూమి తగాదా విషయంలో మాట్లాడుతున్నాడని కోపంతో ఉన్నారని వారే సిల్వరాజును పాత కక్షలను మనసులో పెట్టుకొని కిడ్నాప్ చేసి ఉంటారని శివరాజు భార్య పాము స్వర్ణలత ఇచ్చిన పిర్యాదుపై ముదిగొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినారు. కిడ్నాప్ ను సవాలుగా తీసుకున్న పోలీస్ లు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు, ముదిగొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మురళి  సారధ్యంలో ఎస్సై అశోక్ తో పాటుగా సిబ్బందిని రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి హైదరాబాద్ వారి లొకేషన్ ట్రేస్ చేస్తూ సిల్వరాజు ను గంటల వ్యవధిలోనే ట్రేస్ చేయటం జరిగినది.  పండ్రెగుపల్లి లో షేక్ ఇబ్రాహీం, షేక్ ఫక్రుద్దీన్ అను అన్నదమ్ములకు (08) ఎకరాల భూమి పంపకాల విషయంలో తగదా ఉన్నది. షేక్ ఫక్రుద్దీన్ తన తల్లిదండ్రులను పట్టించుకోకుండా  హైదరాబాద్ లో ఉంటున్నందున షేక్ ఇబ్రాహీం తన తల్లి దండ్రులను పోషించాడు. తల్లిదండ్రులను పోషించినందుకు ఆ ఊరిలో ఉన్న పెద్ద మనషులు షేక్ ఇబ్రాహీం కు (03) ఎకరాల భూమిని ఇవ్వమని చెపుతారు, అందులో సిల్వరాజు కూడా గట్టిగా షేక్ ఇబ్రాహీంకు సపోర్ట్ చేస్తాడు. ఈసంవత్సరం జనవరి నెలలో  షేక్   ఫక్రుద్దీన్, అతని కొడుకులు బోదల సాహెబ్ @ ముస్తఫా, షేక్ ఖాసిం సాహెబ్ కలిసి హైదరాబాద్ నుండి కిరాయి మనుషులని తీసుకు వచ్చి ఫెన్సింగ్ వేస్తుండగా, ఈ విషయం తెలిసి పాము సిల్వరాజు జనాలను తీసుకు వచ్చి ఫెన్సింగ్ వేయకుండా అడ్డుకున్నాడు. పాము సిల్వరాజు ప్రతి దాంట్లో అడ్డుపడుతున్నాడు, అతను బతికి ఉండగా భూమి వారికి దక్కదని, అతడిని ఎలాగైనా అంతం చేయాలని వీరు ముగ్గురు తండ్రి కొడుకులు కలిసి పథకం పన్ని హైదరాబాద్ కు చెందిన బోదల్ సాహెబ్ స్నేహితులైన (1) సయ్యద్ మహమ్మద్ @ బాబా, (2) మెయిర్బాన్ సింగ్, (3) డంగి సిక్లికర్ కులజీత్ సింగ్, (4) డంగి సిక్లికర్ ఆజాద్ సింగ్, (5) ఇస్మాయిల్, (6) కోమల (7) ఎండి నూర్ (8) వరికుప్పల తారుణ్ అను ట్రాలీ ఆటో డ్రైవరు అను కిరాయి మనుషులను సిల్వరాజును చంపితే 15 లక్షలు శుపారీ ఇచ్చే విధంగా మాట్లాడినారు. అడ్వాన్స్ గా 5 లక్షలు యిచ్చినారు. వారు అనుకున్న పథకం ప్రకారంగా పై ఎనిమంది వ్యక్తులు ఒక అశోక్ లేలాండ్ ట్రక్, ఒక స్విఫ్ట్ డిజైర్ వాహనంలో కత్తులు, ఇనుప రాడ్లు, పెట్రోల్ క్యాన్ వేసుకని తేదీ. 24.03.2026 న రాత్రి బయలు దేరి తెల్లవారి అనగా 25.03.2026 ఉదయం సమయంలో సిల్వరాజు ఖానాపురం రోడ్డుకు వాకింగ్ కు వస్తాడని తండ్రీ కొడుకులు ఇచ్చిన సమాచారం మేరకు అతడి కోసం ఎదురు చూస్తుండగా సిల్వరాజు ఒంటరిగా నడుచుకుంటూ వస్తుండగా బలవంతంగా అతడిని వారి వాహనంలో ఎక్కించుకుని కొట్టుకుంటూ చంపుతామని బెదిరిస్తూ, ఎవరూ గుర్తు పట్టకుండా మధ్యలో స్విఫ్ట్ డిజైర్ వాహనంలోకి మార్చి అక్కడి నుండి కొట్టుకుంటూ హైదరాబాద్ తీసుకు వెళ్ళినారు. ఇక్కడ బయలు దేరిన దగ్గర నుండి ప్రతి విషయం సయ్యద్ మహమ్మద్ @ బాబా, వీడియో తీస్తూ బోదల సాహెబ్ కు పంపిస్తూ, ఎక్కడ వరకు వచ్చింది ఫోన్ చేసి చెపుతున్నాడు. మధ్యలో ఒకసారి కుటుంబ సభ్యులతో బెదిరించి మాట్లాడించి, సిటీ మొత్తం తిప్పి ముదిగొండ పోలీస్ వారి చూపించిన చాకచక్యానికి ఎల్ బి నగర్లో వదిలి వెళ్లిపోయినారు.  
అప్పటినుండి ముద్దాయిల కోసం వెదుకుతుండగా, అందరూ కలిసి హైదరాబాద్ నుండి వైజాగ్ కు వారు ఉపయోగించిన వాహనాలలోనే పారిపోతుండగా, వారి కదళికలను పసిగట్టిన పోలీసులు తెలదారుపల్లి టోల్ ప్లాజా వద్ద ఈరోజు ఉదయం 8:00 గం,,లకు అరెస్ట్ చేసినారు.    ముద్దాయిల వద్దనుండి ఒక అశోక్ లేలాండ్ ట్రక్, ఒక మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్, రూ,, 1,05, 000/- ల నగదు  మరియు (08) సెల్ ఫోన్లు స్వాధీన పర్చుకోనైనది. 

ముద్దాయిల వివరాలు: 
1-    ముస్తఫా @ బోదల్ సాహెబ్ 40 సం,,లు,  రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇల్లు సన్ సిటీ, బండ్లగూడ జాగీర్, రాజేంద్ర నగర్, హైదరాబాద్,  పండ్రెగుపల్లి గ్రామం, ముదిగొండ మండలం

2-    షేక్ ఫక్రుద్దీన్ , 67 సం,, వ్యవసాయం, ఇల్లు పండ్రెగుపల్లి గ్రామం, ముదిగొండ మండలం

3-    షేక్ ఖాసిం సాహెబ్ , 41 సం, మెడికల్ ఎక్విప్మెంట్ సేల్స్ వ్యాపారం, నాగోల్, ఎల్బీ  నగర్, హైదరాబాద్, ఎన్/ ఓ  పండ్రెగుపల్లి గ్రామం, ముదిగొండ మండలం

4-    సయ్యద్ మహహమ్మద్ @ బాబా 44 సం,,లు, కులం:, కార్ డ్రైవరు, ఇంటి అడ్రస్ రేతిబౌలీ, అత్తాపూర్, హైదరాబాద్.

5-    డంగి మయిర్బాన్ సింగ్ , 28 సం,,లు, వెల్డింగ్ పని, ఇంటి నెంబర్ . 2-231, శ్రీనగర్ కాలనీ, బాలాజీ నగర్, పాతహఫీజ్ పేట, తిరుమలగిరి, మియాపూర్,

6-    డంగి సిలికర్ కుల్జీత్ సింగ్ , 23 సం,, వెల్డింగ్ పని, నివాసం జవహర్ నగర్, బాలాజీ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్.

7-    సిలికర్ ఆజాద్ సింగ్ 21 సం,, వెల్డింగ్ పని, నివాసం జవహర్ నగర్, బాలాజీ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్.

8-    సయ్యద్ ఇస్మాయిల్ 37 సం,, పెయింటింగ్ పని, నివాసం కౌకూర్, భరత్ నగర్, వాంబేకాలనీ, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్

9-    రొక్కం కోమల, 38 కూలీ పని,  నివాసం కౌకూర్, భరత్ నగర్, వాంబేకాలనీ, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్

10-  వరికుప్పల తరుణ్  26 అశోక్ లేలాండ్ ఓనర్/ IMG-20260402-WA0128
డ్రైవరు నెం. టీజీ 08 వి 4790, నివాసం గబ్బిలాల్ పేట, జవహర్ నగర్, కౌకూర్, భరత్ నగర్, వాంబేకాలనీ, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్. అని ఏసిపి వివరాలు తెలియజేశారు

Tags:

Post Your Comments

Comments

Latest News

చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ
చిల్పూర్,ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు): భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిల్పూర్ మండలంలో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని...
సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి... 
జిల్లాలో విజయవంతంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ ... 
జమ్మికుంట గణేష్ నగర్‌లో దివ్య హనుమాన్ పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
పట్టు చీర మహోత్సవానికి హాజరైన చిన్నారెడ్డి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు జమ్మికుంటలో మంచి స్పందన
పెద్ద తండలో సన్న బియ్యం పంపిణీ…