కూకట్పల్లి ఆరోగ్య కేంద్రంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కూకట్పల్లి ఆరోగ్య కేంద్రంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

_పేషంట్లకు మెరుగైన సేవలు అందించాలి 

– 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశం

మేడ్చల్–మల్కాజిగిరి, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

పేషంట్లు నమ్మకంతో ఆసుపత్రులకు వస్తున్న నేపథ్యంలో వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించడం వైద్యుల బాధ్యత అని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు.గురువారం కూకట్పల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎం అండ్ హెచ్ఓ ఉమాగౌరి తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పనితీరు, సౌకర్యాలపై సమగ్రంగా సమీక్షించారు.రోజువారీ పేషంట్ల సంఖ్య, వారి వివరాలను రిజిస్టర్లలో నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, అన్ని వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలు, అవసరాలపై మెడికల్ ఆఫీసర్‌ను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.ఆసుపత్రికి అవసరమైన మరమ్మత్తులు, మౌలిక వసతులు, డెలివరీ సేవలకు సంబంధించిన సిబ్బంది కొరత వంటి అంశాలను ప్రస్తావించగా, వాటిపై వెంటనే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు.పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, శానిటేషన్ సిబ్బందితో సమన్వయం చేసుకుని ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. మందుల గదిని తనిఖీ చేసి, ఎక్స్‌పైరీ తేదీలను పరిశీలించి మాత్రమే పేషంట్లకు మందులు అందించాలని సిబ్బందికి తెలిపారు.ఆసుపత్రుల్లో సేవల నాణ్యత పెంచేందుకు అధికారులు కృషి చేయాలనికలెక్టర్ స్పష్టం చేశారు.IMG-20260402-WA0138

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .