కాప్రా మజిద్‌లో సీసీ కెమెరాల ప్రారంభం

కాప్రా మజిద్‌లో సీసీ కెమెరాల ప్రారంభం

_భద్రతా వ్యవస్థ బలోపేతానికి సీసీ కెమెరాలు కీలకం 

– ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కాప్రా, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ పరిధిలో కాప్రా మజిద్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతంలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ప్రజల భద్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.అలాగే శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాల నెట్‌వర్క్ ఎంతో ఉపయోగకరమని, స్థానిక ప్రజల సహకారంతో మరింత సురక్షిత వాతావరణం ఏర్పాటు చేయవచ్చని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కుషాయిగూడ సీఐ భాస్కర్ రెడ్డి, మైనార్టీ నాయకులు బద్రుద్దిన్, తాజుద్దీన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .