గ్రామస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యం.!
- అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచన.
- ఎమ్మెల్యే జారె ఆదినారాయణ.
దమ్మపేట, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దమ్మపేట మండలంలోని పలు గ్రామపంచాయతీలలో గురువారం నిర్వహించిన గ్రామసభల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడమే గ్రామసభల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇటీవల ఎన్నికైన గ్రామపంచాయతీ ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పారదర్శకంగా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు.


Comments