వెల్టూర్ దర్గా దర్శనానికి దారి కల్పించాలని గ్రామసభలో వినతి 

వెల్టూర్ దర్గా దర్శనానికి దారి కల్పించాలని గ్రామసభలో వినతి 

ముస్లిం స్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలి 

-- ఖజా హుస్సేన్ వెల్టూర్ గ్రామస్తుడు 

పెద్దమందడి,ఏప్రిల్2(తెలంగాణ ముచ్చట్లు): 

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో దర్గా దర్శనానికి సరైన దారి కల్పించాలని గ్రామసభలో గ్రామస్తుడు ఖాజా హుస్సేన్ వినతి పత్రం సమర్పించారు.వెల్టూర్ గ్రామంలోని పెద్ద బావి సమీపంలో ఉన్న దర్గా వద్ద భక్తులు దర్శనం చేసుకోవడానికి సరైన మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.వెల్టూర్ గ్రామంతో పాటు ఇతర గ్రామాల నుండి కూడా భక్తులు మొక్కులు చెల్లించడానికి వస్తుంటారని, దారి సౌకర్యం లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు దర్గా చేరుకునే సమయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సమీప రైతులతో మాట్లాడి దర్గా వరకు దారి ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజల తరఫున గ్రామసభలో అధికారులకు విజ్ఞప్తి చేశారు.అలాగే వెల్టూర్ గ్రామంలో సుమారు 50 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఇప్పటివరకు వారికి స్మశాన వాటిక ఏర్పాటు కాలేదని తెలిపారు. పేద ముస్లిం కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని స్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని కోరారు. ప్రభుత్వ భూమిలోని సర్వే నంబర్లు 21, 22, 23లో స్థలం కేటాయించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .