ఈద్ పర్వదినం జమ్మికుంటలో ఆనందోత్సాహాల వెల్లువ

ఈద్ పర్వదినం జమ్మికుంటలో ఆనందోత్సాహాల వెల్లువ

జమ్మికుంట టౌన్, మార్చ్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

ఈద్ పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణం ఆనందోత్సాహాలతో కళకళలాడింది. బిజిగిరి షరీఫ్ ప్రాంతం పండుగ శోభతో ముస్తాబై భక్తులతో కిటకిటలాడింది. షవ్వాల్ నెలవంక దర్శనంతో నెలరోజులపాటు కఠినంగా పాటించిన ఉపవాసాలకు ముగింపు పలికిన ముస్లిం సోదరులు ఈద్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
బిజిగిరి షరీఫ్ దర్గాలో తెల్లవారుజామునే భక్తుల రద్దీ నెలకొంది. ప్రత్యేక నమాజ్‌లో వేలాది మంది పాల్గొని అల్లాహ్‌కు ప్రార్థనలు చేశారు. దేశంలో శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ప్రార్థించారు. నమాజ్ అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ “ఈద్ ముబారక్” అంటూ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం హృద్యంగా మారింది.
పట్టణంలోని వీధులన్నీ పండుగ కాంతులతో మెరిసిపోయాయి. ఇంటింటా ప్రత్యేక వంటకాలతో సందడి నెలకొంది. ముఖ్యంగా షీర్ ఖుర్మా సువాసనలు ప్రతి ఇంటిని పరిమళింపజేశాయి. చిన్నారులు కొత్త దుస్తుల్లో ఉత్సాహంగా కనిపించగా, యువత సందడి మరింత ఆకర్షణగా నిలిచింది.
మానవతా విలువలకు ప్రతీకగా పేదలకు ఫిత్రా దానం చేసి సహాయహస్తం చాచారు. పండుగ సందర్భంగా మత సామరస్యం, సోదరభావం ప్రతిబింబించాయి.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్, పట్టణ సీఐ రామకృష్ణ, మతపెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొని ముస్లిం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సమైక్యతా సౌరభం.. రంజాన్ సంబరం! సమైక్యతా సౌరభం.. రంజాన్ సంబరం!
ఖమ్మం బ్యూరో, మార్చి 21(తెలంగాణ ముచ్చట్లు) భారతీయ జీవన స్రవంతిలో అంతర్భాగమైన గంగా-జమునా తెహజీబ్‌కు నిలువుటద్దంగా, మత సామరస్యానికి మకుటాయమానంగా రంజాన్ పర్వదిన వేడుకలు శనివారం జిల్లా...
విద్యారంగానికి కేవలం 8.2% కేటాయింపు తీవ్ర అన్యాయం 
వనపర్తిలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లెల్ల ఆదిత్య రెడ్డి
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు 
విద్యకు న్యాయం చేయాలంటూ ఎస్ఎఫ్ఐ హెచ్చరిక
మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి