కాంగ్రెస్ పార్టీ  ఖమ్మం జిల్లా కార్యదర్శిగా  "దామా స్వరూప" నియామకం

కాంగ్రెస్ పార్టీ  ఖమ్మం జిల్లా కార్యదర్శిగా 

ఖమ్మం బ్యూరో, మార్చి 20(తెలంగాణ ముచ్చట్లు)

ఖమ్మం నగరంలోని 13వ డివిజన్‌కు చెందిన సామాజిక కార్యకర్త,కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దామా స్వరూప ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ కారక్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు క్రమశిక్షణతో,నిబద్ధతో పని చేస్తూ,పార్టీ బలోపేతానికి, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె చేస్తున్న కృషిని,ఆమెలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి,జిల్లా నాయకత్వం సిఫార్సుల మేరకు అధిష్టానం దామా స్వరూపను కార్యదర్శిగా నియమించింది.తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ ఆదేశాలు,సూచనల మేరకు పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వహిస్తానని, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ,ప్రభుత్వ చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, పార్టీని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.ఆమె నియామకం పట్ల కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకులు,కార్యకర్తలు,పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .