అమావాస్య సందర్భంగా కీసరగుట్టలో అన్నాభిషేకం నిర్వహణ

అమావాస్య సందర్భంగా కీసరగుట్టలో అన్నాభిషేకం నిర్వహణ

కీసరగుట్ట, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర డివిజన్–1 పరిధిలోని ప్రసిద్ధ కీసరగుట్టలో శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక అన్నాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఆలయ చైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ పూజారులు స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం
జమ్మికుంట టౌన్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మున్సిపల్ నూతన పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్...
గిరిజనలకు ఇచ్చిన హామీలను అమలుకై 25వేల కోట్లు కేటాయించాలి 
రంగాపూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు
గీత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -- చైర్మన్ సుహాసిని.
ఆపదలో అండగా పీఆర్టీయూ టిఎస్ ఉపాధ్యాయ సంఘం 
శ్రీ పరాభవ ఉగాది.... వసంత శోభ
తోవ