వేలేరు ZPHSలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

వేలేరు ZPHSలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

వేలేరు, మార్చ్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద 6వ నుండి 9వ తరగతి వరకు చదువుతున్న క్లాస్ టాపర్ బాలికలకు సైకిళ్లు మరియు ఇతర వస్తువులతో కూడిన కిట్‌లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి, SBI బ్యాంక్ మేనేజర్ గౌరవ శ్రీ కుమారస్వామి విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 480 పాఠశాలలలో 10 పాఠశాలల్లో మన పాఠశాల ఎంపిక కావడం మేనేజర్ కృషికి నిదర్శనమని అభినందించారు. విద్యార్థులు చదువులో మరింత రాణిస్తే భవిష్యత్తులో ఇలాంటి ప్రోత్సాహకాలు మరింతగా అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్తయ్యతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .