కమలానగర్‌లో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ సభ

కమలానగర్‌లో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ సభ

_రాంశెట్టి రోశయ్య, బంగారు ఆచార్యుల ఐదు పుస్తకాల విడుదల

_సాహిత్యవేత్తల సమక్షంలో స్ఫూర్తి గ్రూపు ఆధ్వర్యంలో కార్యక్రమం

కమలానగర్, మార్చి 17 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూపు ఆధ్వర్యంలో కమలానగర్ సిఐటియు కార్యాలయ ప్రాంగణంలో సోమవారం రాత్రి పుస్తకాల ఆవిష్కరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత రాంశెట్టి రోశయ్య రచించిన మూడు పుస్తకాలు, బంగారు వి.బి ఆచార్యులు రచించిన రెండు పుస్తకాలు ఆవిష్కరించారు.సమాచార హక్కు సాధన నాయకులు గగన్ కుమార్ ఆహ్వానితులను వేదికపైకి ఆహ్వానించగా, ప్రముఖ రచయిత కె. ఆనందాచారి, సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్, రచయిత్రి పి. జ్యోతి, స్ఫూర్తి గ్రూపు బాధ్యులు గొడుగు యాదగిరిరావు, రచయిత బంగారు ఆచార్యులు, వ్యాఖ్యాత పద్మావతి తదితరులు వేదికను అలంకరించారు. కార్యక్రమానికి ముందుగా రుక్కయ్య ఆలపించిన ప్రారంభ గీతం ఆకట్టుకోగా, నవతెలంగాణ రవి, చల్లా లీలావతి బృందం పాటలు సభను ఉత్సాహభరితంగా మార్చాయి.సభకు అధ్యక్షత వహించిన పి. జ్యోతి మాట్లాడుతూ రాంశెట్టి రోశయ్య వందేళ్లు దాటినా రచనా వ్యాసంగాన్ని కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. బంగారు ఆచార్యులు అభ్యుదయ భావాలతో సాహిత్య రంగానికి విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు.ఈ సందర్భంగా రోశయ్య రచించిన “ప్రపంచీకరణ”, “నాదే కులం”, “నానీలు” పుస్తకాలను కె. ఆనందాచారి ఆవిష్కరించగా, బంగారు ఆచార్యులు రచించిన “దీపశిఖ”, “దృష్టికోణం” పుస్తకాలను మౌనశ్రీ మల్లిక్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఆనందాచారి, రోశయ్య ప్రజా ఉద్యమాలతో మమేకమై ప్రజా సమస్యలపై విస్తృతంగా రచనలు చేశారని తెలిపారు.మౌనశ్రీ మల్లిక్ మాట్లాడుతూ స్ఫూర్తి గ్రూపు నాయకులు గొడుగు యాదగిరిరావుతో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ సాహిత్య, సామాజిక రంగాల్లో కలిసి ముందుకు సాగుతున్నామని చెప్పారు. బంగారు ఆచార్యులు శ్రామిక భావాలతో రచనలు చేస్తున్న కవిగా అభివర్ణించారు.పుస్తకాల పరిచయాన్ని గొడుగు యాదగిరిరావు, పద్మావతి సమగ్రంగా నిర్వహించగా, సభలో గద్దల నరసింహారావు, వి.వి వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.ఈ సందర్భంగా కె. ఆనందాచారి, పి. జ్యోతి, బంగారు ఆచార్యులు, పద్మావతి, రుక్కయ్య, నవతెలంగాణ రవి తదితరులను చేనేత వస్త్రాలతో సత్కరించారు. చివరగా జయరాజు వందన సమర్పణతో కార్యక్రమంముగిసింది. కార్యక్రమం విజయవంతానికి రోశయ్య మనవడు చైతన్య సహకారం అందించారు. IMG-20260317-WA0047

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .