వెల్టూర్ సర్పంచ్ అశోక్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వెల్టూర్ సర్పంచ్ అశోక్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

పెద్దమందడి,మార్చి16(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ సర్పంచ్ దండు అశోక్ ఇటీవల అనారోగ్యంతో మహబూబ్‌నగర్‌లోని ఆర్.ఆర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కిడ్నీలో రాయి (స్టోన్) రావడంతో వైద్యుల సూచన మేరకు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. చికిత్స అనంతరం ఆదివారం తన స్వగ్రామం వెల్టూర్‌కు తిరిగి చేరుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం వెల్టూర్ గ్రామానికి వచ్చి సర్పంచ్ అశోక్‌ను వారి నివాసంలో కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అక్కడే ఉన్న సర్పంచ్ అన్న దండు నరేష్‌తో మాట్లాడి అశోక్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరం వచ్చినప్పుడు తాము అండగా ఉంటామని మాజీ మంత్రి వారికి ధైర్యం చెప్పారు.ఈ  కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి  రఘుపతి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సాకే వెంకటయ్య, మాజీ గ్రామ రైతుబంధు అధ్యక్షులు  రఘువర్దన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ సెలక్షన్ కమిటీ సభ్యుడు చిత్తూరు కృష్ణారెడ్డి, దండు నరేష్, సుంకరి బుసయ్య, సుద్ద బాయి రాజు, జింకల బాలరాజు, తమ్మలి రాము, జింకల సాయి తదితరులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .