సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు నో చెప్పాలి

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు నో చెప్పాలి

_99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో అవగాహన 

_కూకట్పల్లి రిషి యూబీఆర్ ఉమెన్స్ కాలేజ్‌లో నిర్వహణ


మేడ్చల్ మల్కాజ్గిరి, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):

99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం, మేడ్చల్ ఆధ్వర్యంలో “సే నో టు సింగిల్ యూజ్ప్లాస్టిక్” అంశంపై అవగాహన కార్యక్రమం కూకట్పల్లిలోని రిషి యూబీఆర్ ఉమెన్స్ కాలేజ్‌లో నిర్వహించారు.IMG-20260316-WA0081
ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ బి.రాజేందర్ పాల్గొని ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే హానికారక ప్రభావాలను విద్యార్థులకు వివరించారు. ప్లాస్టిక్ వినియోగం కారణంగా భూమి, నీరు మరియు జీవ వ్యవస్థలకు కలిగే నష్టాలను తెలియజేశారు. అలాగే నిత్యజీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి వివరించారు.సుమారు 200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడంతో పాటు కొంతమంది ప్రసంగించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై వివరించారు. అదేవిధంగా క్విజ్ కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల్లో అవగాహన పెంపొందించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించేందుకు అవగాహన పోస్టర్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరిగిందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకురాలు భార్గవి, పర్యావరణ ఇంజనీర్ బి.రాజేందర్ మరియు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణలో బంజారాలకు అన్యాయం  తెలంగాణలో బంజారాలకు అన్యాయం 
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం
సత్తుపల్లి బార్ అసోసియేషన్‌కు నూతన కమిటీ.!
వరి పంటలో తాలు గింజలు… రైతులకు గట్టి దెబ్బ.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 
చిలుకటోనిపల్లి వాగులో రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా
పామిరెడ్డిపల్లిలో రంజాన్ ఇఫ్తార్ విందు – సర్వమత సామరస్యానికి నిదర్శనం