స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు

ఖమ్మం బ్యూరో,మార్చి 17(తెలంగాణ ముచ్చట్లు)

 స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో మంగళవారం ముందస్తు రంజాన్ పర్వదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.పాఠశాల చిన్నారులు తమ మిత్రులకు ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు ఖర్జూరాలు,పండ్లు, సేమియాలు అందించి తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటారు. మతసామరస్యానికి ప్రతీకగా పాఠశాలలో అన్ని తరగతుల విద్యార్థులు రంజాన్ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రపంచమంతటా మతసామరస్యాన్ని చాటుతూ రంజాన్ వేడుకలను నిర్వహించి తోటి మానవుల పట్ల తమ ఆదరాభిమానాలను ప్రదర్శించే పండుగ రంజాన్ పర్వదినం అని పేర్కొన్నారు. కఠోర ఉపవాసాన్ని ఆచరించి చివరి రోజు ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారని తెలిపారు. రంజాన్ మాసంలోనే పవిత్ర ఖురాన్ మత గ్రంథం దివి నుంచి భూమికి చేరిన పవిత్ర మాసం అని తెలియజేశారు. ఓర్పు,సహనం, త్యాగనిరతి,పరోపకారం,దానధర్మ భావనలు రంజాన్ పర్వదినం మనకి అందరికీ సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.IMG-20260317-WA0059

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .