దళితుల అభ్యున్నత కోసం సంక్షేమ పథకాలు బలోపేతం చేయాలి

దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నిమ్మల మనోహర్

దళితుల అభ్యున్నత కోసం సంక్షేమ పథకాలు బలోపేతం చేయాలి

ఎల్కతుర్తి, మార్చ్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నిమ్మల మనోహర్, కార్యదర్శి రెంటాల దేవా మాట్లాడుతూ దళితుల అభ్యున్నత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దాదాపు 76 సంవత్సరాలు గడిచినా దళితులు ఇంకా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.
దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని, జనాభా ఆధారంగా బడ్జెట్‌లో 20 శాతం నిధులను దళితులకు కేటాయించాలని కోరారు. కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా దళితుల సంక్షేమానికి వినియోగించాలని అన్నారు.
ప్రైవేట్ రంగంలో దళితులకు రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు సబ్సిడీ నిధులను విడుదల చేసి, కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు.
దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అంటరానితనాన్ని తక్షణమే అరికట్టాలని, భారత రాజ్యాంగం ప్రకారం దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను కల్పించాలని తెలిపారు. దళితులకు విద్యా హక్కు, భూమి హక్కు మరియు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా మేనిఫెస్టోలో పేర్కొన్న అంబేద్కర్ హస్తం పథకం కింద దళితులకు 12 లక్షల రూపాయల మంజూరు అంశంపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని అన్నారు. మార్చి 16 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో 50 శాతం ఇళ్లు దళితులకు కేటాయించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ అంశాలపై దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి శనిగరపు రాజ్ కుమార్, ధర్మసాగర్ మండల కార్యదర్శి రాజారపు రత్నం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌పై అసత్య ప్రచారాలు కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌పై అసత్య ప్రచారాలు
_నిరాధార ఆరోపణలపై కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు _అసోసియేషన్ ప్రతిష్టను దెబ్బతీయాలని ఉద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారని ఆరోపణ కుషాయిగూడ, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు): ఉప్పల్ నియోజకవర్గం కాప్రా...
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు నో చెప్పాలి
నాచారంలో సమస్యలపై డిప్యూటీ కమిషనర్‌ కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నేతలు
సీనియర్ పాత్రికేయుడు వెంకటరమణారెడ్డి సంస్మరణ సభ 
వెల్టూర్ సర్పంచ్ అశోక్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
కాప్రా సర్కిల్‌లో దోమల బెడద తీవ్రం వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి
భద్రాద్రి అభివృద్ధిపై మంత్రి తుమ్మల ఫోకస్.!