ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందిన జన్ను వెంకటరమణకు ఘన సత్కారం

ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందిన జన్ను వెంకటరమణకు ఘన సత్కారం

వనపర్తి,మార్చి14(తెలంగాణ ముచ్చట్లు):

ఉత్తమ అధికారులు తమ సేవలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన వనపర్తికి చెందిన రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన జన్ను వెంకటరమణను శనివారం సాహితీ కళా వేదిక ప్రతినిధులు ఆయన స్వగృహంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ వెంకటరమణ 37 సంవత్సరాల పాటు ఉత్తమ అధికారిగా నిష్కళంకంగా విధులు నిర్వర్తించి ఎక్కడా ఎలాంటి ఆరోపణలు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రశంసలు పొందారని కొనియాడారు. ఆయన సేవా జీవితం అనేక మందికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక ప్రతినిధులు బైరోజు చంద్రశేఖర్, బండారు శ్రీనివాస్, ఆర్డీఎస్ సంస్థ నిర్వాహకురాలు చిన్నమ్మ థామస్, గంధం నాగరాజు, గ్రామభారతి నిర్వాహకుడు కరుణాకర్ గౌడ్, శ్రీలక్ష్మి, అరుణ, మింటూ, కల్పన, ముబీన, దివ్య భారతి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .