రంజాన్ తోఫాలను పంపిణీ చేసిన పరమేశ్వర్ రెడ్డి
_సెవెన్ హిల్స్ కాలనీ అక్సా మసీదులో ముస్లిం
_సోదరులకు రంజాన్ కానుకలు
ఉప్పల్, మార్చ్ 13 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గంలోని సెవెన్ హిల్స్ కాలనీ అక్సా మసీదులో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తోఫాలను అందజేశారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సోదరుల ఆధ్యాత్మికతకు ప్రతీక అని, సమాజంలో సోదరభావం మరియు ఐక్యత పెంపొందేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షులు ఆఫ్జాల్, అబ్దుల్ సత్తార్, ఖాదర్ బాషా, బాషా, ఖాదర్ వలి, సలీమ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సుంకు శేఖర్ రెడ్డి, కృష్ణయ్య, శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, మంద మురళీకృష్ణ రెడ్డి, అమర్, సత్యం, ప్రేమ్ గౌడ్, ప్రణయ్ యాదవ్, తుమ్మల దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments