విట్ట శ్రీనివాస్ రెడ్డి మృతి.. నల్ల బ్యాడ్జీలతో అఖిలపక్ష నాయకుల సంఘీభావం

విట్ట శ్రీనివాస్ రెడ్డి మృతి.. నల్ల బ్యాడ్జీలతో అఖిలపక్ష నాయకుల సంఘీభావం

పెద్దమందడి,మార్చి13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మదిగట్ల గ్రామంలో మాజీ మండల పీఏసీఎస్ చైర్మన్ విట్ట శ్రీనివాస్ రెడ్డి మృతి పట్ల అఖిలపక్ష నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విట్ట శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు పొందారని తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.ఆయన మరణం మండలానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు.అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు పలువురు స్థానికులు పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .