ఉత్తమ ఎంఈఓగా రాజేశ్వరరావుకు అవార్డు.!
ప్రైవేట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘన సత్కారం.
Views: 48
On
సత్తుపల్లి, మార్చి 11(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సత్తుపల్లి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) నక్కా రాజేశ్వరరావుకు “ఉత్తమ ఎంఈఓ” అవార్డును ప్రదానం చేశారు. మండలంలో విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం, మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా నిర్వహించడం, విద్యార్థులు, ఉపాధ్యాయులకు అంకితభావంతో సేవలందించడం, అక్షరాస్యత అభివృద్ధికి కృషి చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని ప్రైవేట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో బుధవారం రాజేశ్వరరావును ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో చీకటి శ్రీనివాసరావు, పులి శ్రీనివాసరావు, నాయుడు వెంకటేశ్వరరావు, పసుపులేటి నాగేశ్వరరావు, ఎదుల్ల మురళి తదితరులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Mar 2026 21:16:56
మేడ్చల్ మల్కాజ్గిరి, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):
భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు భూగర్భ జల వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత...


Comments