పదవ తరగతి విద్యార్థులకు ఉచిత ఎగ్జామినేషన్ ప్యాడ్స్.

పదవ తరగతి విద్యార్థులకు ఉచిత ఎగ్జామినేషన్ ప్యాడ్స్.

- దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమం.
- కాకర్లపల్లి, నాచారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పంపిణీ.
- ఊటుకూరు వెంకట్, సూర్య రాట్నాల ఆధ్వర్యంలో కార్యక్రమం.

సత్తుపల్లి, మార్చి 11 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు దమ్మపేట మండలం నాచారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా ఎగ్జామినేషన్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు సౌకర్యంగా రాయడానికి వీలుగా ఈ ప్యాడ్స్ అందజేశారు. విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్స్ అందజేయడం జరిగింది.IMG-20260311-WA0059. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఊటుకూరు వెంకట్, సూర్య రాట్నాల సేవలను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామస్థులు అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .