బాలికలకు సైకిళ్ల పంపిణీ

బాలికలకు సైకిళ్ల పంపిణీ

_చదువులో ముందుండి అన్నిరంగాల్లో రాణించాలి 

– కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, మార్చి 10 ( తెలంగాణ ముచ్చట్లు):

బాలికలు చదువులో ముందుండి భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాలికలకు ఉచితంగా 100 సైకిళ్లు అందించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ వంద శాతం హాజరు ఉన్న బాలికలకు సైకిళ్లు మంజూరు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి 21 మంది విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి, విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.IMG-20260310-WA0130

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .