మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

_సీసీ రోడ్డు, నాలా అభివృద్ధి, బండచెరువు శుభ్రతపై వినతిపత్రం

మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి

మల్కాజ్‌గిరి, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్  వినయ్ కృష్ణ రెడ్డి, ఐఏఎస్‌ను మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సంబంధించి వినతిపత్రాన్ని కమిషనర్‌కు అందించారు. సంతోష్ మాత గుడి నుండి నల్ల పోచమ్మ గుడి వరకు ఉన్న దీనదయాళ్ నగర్ రహదారిపై రూ.134 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన నంబర్‌తో కూడిన వినతిపత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు.ఈ ప్రతిపాదనను గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, ఐఏఎస్ ఆమోదించినట్లు ఆమె పేర్కొన్నారు.అలాగే సూర్యనగర్ నాలాను ఎస్‌ఎన్‌డీపీ పథకం క్రింద అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. బండచెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి దోమల బెడదను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, అక్కడ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గడప నర్సింగ్ రావు, మంగేష్ కుమార్, ఓం ప్రకాష్ పాల్గొన్నారు. తమ ప్రతిపాదనలకు మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్ ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం...
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య
కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!