మాదక ద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన సదస్సు.

మాదక ద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన సదస్సు.

హాసన్ పర్తి,మార్చ్ 10(తెలంగాణ ముచ్చట్లు):

విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం,మత్తు పదార్థాల  వల్ల కలిగే అనర్ధాలపై హాసన్ పర్తి,  వంగపహాడ్,మల్లారెడ్డిపల్లి,నాగారం గ్రామలలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం హాసన్ పర్తి సీఐ చేరాలు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా ఖాజిపేట ఏసీపీ పి.ప్రశాంత్ రెడ్డి,ఈగల్ ఫోర్స్ తెలంగాణ టీమ్ ఏసిపి నర్సింగరావు హాజరై మాట్లాడారు గుడుంబా,బెల్లం,గంజాయి,డ్రగ్స్ వినియోగించడం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నట్లు తెలిపారు.ఇలాంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు.చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు.ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా,సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మత్తు పదార్థాలు జీవితాన్ని నాశనం చేస్తాయని డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు. డ్రగ్స్ అనే మహమ్మరీ యువత భవిష్యత్తులో నాశనం చేస్తుందని హెచ్చరించారు.గంజాయి విక్రయం, వినియోగంపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.గ్రామంలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేయాలని పిలుపునిచ్చారు.వంగపహాడ్ గ్రామంలోని ప్రధాన కూడలిలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.ఇట్టి కార్యక్రమానికి నిర్వహించినందుకు స్థానిక ప్రజలు పోలీస్ అధికారులకు సన్మానించారు.ఈ కార్యక్రమంలో హాసన్ పర్తి సిఐ చేరాలు, ఎస్సై రవి, దేవేందర్ లు రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎక్స్సిస్ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, ప్రభుత్వ పాఠశాల సిబ్బంది,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.IMG-20260310-WA0106

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .