సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
- పీవీఎస్‌ఆర్ సెంటెనరీ కాలనీలో నిర్వహణ.
- ఎమ్మెల్యే మట్టా రాగమైయి హాజరు.
- మహిళలకు పోటీలు, బహుమతులు.
సత్తుపల్లి, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):
సింగరేణి సత్తుపల్లి ఏరియాకు చెందిన పీవీఎస్‌ఆర్ సెంటెనరీ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి చింతల లక్ష్మీ శ్రీనివాస్ మరియు సేవా సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్టా రాగమైయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కల్లూరు ఏసీపీ వసుందర యాదవ్, ఐపీఎస్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్, ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి చింతల లక్ష్మీ శ్రీనివాస్ చేతుల మీదుగా మున్సిపల్ చైర్‌పర్సన్ ఎం.డి. రెహనా బేగం, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ బొంతు సుమలత, కిష్టారం గ్రామ సర్పంచ్ నరుకుల రాజేశ్వరి, 13వ వార్డు కౌన్సిలర్ ఉప్పు నాగమణి తదితరులను సన్మానించారు. అధికారులు, ఉద్యోగుల గృహిణుల కోసం నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం సేవా సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వేడుకలను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎం.డి. రెహనా బేగం, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ బొంతు సుమలత, కిష్టారం గ్రామ సర్పంచ్ నరుకుళ్ళ రాజేశ్వరి, 13వ వార్డు కౌన్సిలర్ ఉప్పు నాగమణి, బి. నవ్య కోటేశ్వరరావు (ఐఎన్‌టీయూసీ), శ్రీవాణి సూర్యప్రకాష్ (ఏఐటీయూసీ)తో పాటు సేవా సభ్యులు పాల్గొన్నారు.


Comments