మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ, ఆశా కార్మిక నాయకులకు సన్మానం
స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో చేనేత వస్త్రాలతో ఘనంగా గౌరవం
ఏ ఎస్ రావు నగర్, మార్చి 9 (తెలంగాణ ముచ్చట్లు)
అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా కార్మిక నాయకులను చేనేత వస్త్రాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి సమన్వయంగా స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు వ్యవహరించారు.ఈ సందర్భంగా స్ఫూర్తి గ్రూప్ నాయకురాలు పద్మావతి మాట్లాడుతూ శ్రామిక మహిళలు పోరాట యోధులుగా నిలిచి అనేక హక్కులు సాధించారని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉద్యమాలతో సమాన హక్కులు సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ధరణి పత్రిక మహిళా సంపాదకురాలు రోజా రాణి మాట్లాడుతూ మహిళలు ఐక్యంగా పోరాటం చేస్తేనే వారి హక్కులు సాధ్యమవుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు డి. అనితను స్ఫూర్తి గ్రూప్ నాయకులు పద్మావతి, అనురాధలు చేనేత వస్త్రాలతో సత్కరించారు. అలాగే సెక్రటరీ రేవతి కళ్యాణిని శ్రీమన్నారాయణ, అనురాధలు గౌరవించారు. అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు జి. సునీతను అనురాధ, రోజా రాణిలు చేనేత వస్త్రాలతో సన్మానించగా, యూనియన్ సెక్రటరీ బి. శోభారాణిని రోజా రాణి, పద్మావతిలు సత్కరించారు.పత్రికా రంగంలో 25 సంవత్సరాలుగా సంపాదకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూ పత్రికను విజయవంతంగా నడిపిస్తున్న రోజా రాణిని ఐద్వా నాయకులు అరుణ జ్యోతి, సృజన, వినోద, సిఐటియు నాయకురాలు రమలు చేనేత వస్త్రాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నవతెలంగాణ రవి, కోమటి రవి, జయరాజ్, గుమ్మడి హరి ప్రసాద్
, జన విజ్ఞాన వేదిక జెన్నీ, అనురాధ, సిహెచ్ లీలావతి, పద్మావతి, రోజా రాణి తదితరులు పాల్గొన్నారు.


Comments